test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రిటీష్‌ జనతా పార్టీ ఇక వద్దు

2 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 11:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోనూ కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇక్కడి ఫ్రీడమ్‌ ‌పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో సిజెపి అధ్యక్షులు అభిజిత్‌ ‌ధీప్కే, పర్యావరణవేత్త సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌, విలక్షణ నటులు, సామాజిక కార్యకర్త ప్రకాష్‌ ‌రాజ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచిన జాతీయ పరీక్ష ఏజెన్సీ (ఎన్‌‌టిఎ)ని రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్‌ ‌రాజీనామా చేయాలని యువత మిన్నంటేలా నినదించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి)ను ఉద్ధేశించి అది భారతీయుల పార్టీ కాదని, ఆంగ్లేయులకంటే ధారుణంగా దేశ ప్రజలను పీడిస్తోందని విమర్శించారు. బ్రిటీష్‌ ‌జనతా పార్టీ (బిజెపి) ఇక వద్దు అంటూ ఫ్లకార్డులు పట్టుకొని నినదించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ ‌రాజ్‌ ‌మాట్లాడుతూ ‘పోరాడటానికి యువతరం వస్తోంది..తప్పుకోండి..దారి ఇవ్వండి’ అంటూ పిలుపునిచ్చారు. ‘ఎన్నికైన నేతలు తమ విధులు నిర్వహించాలి. ఈ సూత్రాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. మీరు మా బతుకులతో రాజకీయాలు చేస్తారు. మేము ఉద్యోగాలు చేయాలా? ఇక సాగదు. ఈ దేశ యువత తమ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధపడింది. ఇక తప్పుకోండి. పదవీవిరమణ వయస్సు లోనూ ఇంకా కుర్చీలు పట్టుకొనే వుంటారా? మన భవిత కోసం యువత పోరాడటానికి వస్తోంది. తమ కలల సాకారం కోసం ఈ దేశ యువత పోరాడుతుంది. దారి ఇవ్వండి’ అని ప్రకాష్‌ ‌రాజ్‌ ‌పేర్కొన్నారు. అలాగే, పర్యావరణ వేత్త సోనమ్‌ ‌వాంగ్‌ ‌చుక్‌‌ విద్యారంగానికి చేసిన సేవలను ప్రకాష్‌ ‌రాజ్‌ ప్రశంసించారు. వాంగ్‌చుక్ భారతదేశ విద్యాశాఖ మంత్రి అయితే బాగుండేదన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్