- డాక్టర్ జెట్టి శేషారెడ్డి 18వ స్మారక సదస్సులో ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఏది వాస్తవమో?. ఏది భ్రమో? తెలుసుకునే పరిస్థితిలో ప్రజలు లేరని, వారిలో చైతన్యం నింపి వీధి పోరాటాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి భవనంలో ఆదివారం జరిగిన డాక్టర్ జెట్టి శేషారెడ్డి 18వ స్మారక సదస్సులో ‘వికసిత భారత్ భ్రమలు - వాస్తవాలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలకు అవాస్తవాలు చెబుతూ భ్రమలు కల్పిస్తోందన్నారు. అంతా అద్భుతంగా ఉందనే ప్రచారంతో కాలం గడుపుతోందని విమర్శించారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వివరించారు. ఏ రంగంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని, దేశానికి వెన్నెముఖ అయిన యువతను నిర్వీర్యం చేస్తోందని, ప్రపంచంలో భారత్ కీర్తి తగ్గిపోతోందని అన్నారు. ఇలాంటి సమయంలో జెట్టి శేషారె డ్డి వారసులుగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరముందని తెలిపారు. కంప్యూటర్ ముందు కూర్చొని కాకుండా రోడ్లపైకి వచ్చి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. రానున్న రోజుల్లో మాట్లాడే, పోరాడే స్వేచ్ఛ ఉంటుందనేది అనుమానమేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జిఒతో వందేమాతరం, జనగణమన రెండూ... ప్రభుత్వ కార్యక్రమాల్లో పాడుతున్నారని, రానున్న రోజుల్లో జనగణమన ఉంటుందో, ఉండదో చెప్పలేమన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేస్తున్నారని, భవిష్యత్తులో ఇది ఉంటుందో, ఉండదోనని అనుమానం ప్రస్తుత పరిస్థితులను బట్టి కలుగుతోందని తెలిపారు. 79 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశంలో స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 1927లో కేథలిన్ మదర్ ఇండియా పుస్తకాన్ని రాశారని, ఆ రోజుల్లోనే భారతదేశ పరిస్థితులు, జాతీయ ఉద్యమం తదితర అంశాలు అందులో పేర్కొన్నారన్నారు. ఆ పుస్తకంపై అప్పట్లో గాంధీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నా యన్నారు. ఇటీవల ఆడిటర్ జనరల్ ఒక నివేదికను ఇచ్చారని, అందులో దేశంలోని స్కిల్ డెవలప్‌మెంట్ అమలు ఎలా ఉందో చెప్పారని, దీనిని బట్టి దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 61 లక్షల మంది శిక్షణ పొందారని చెప్తున్నారని, వారి వివరాలు ఎక్కడా లేవని, తప్పుల తడకగా జాబితా తయారు చేశారని, పేర్లు పదేపదే పునరావృతం అయ్యాయని వివరించారు. శిక్షణ పొందినట్లు చెప్పిన 34 లక్షల మందిలో 18 ఏళ్ల పిల్లలకు కూడా డ్రైవింగ్ శిక్ష ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయన్నారు. వాస్తవానికి 18 ఏళ్ల పిల్లలకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వరనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న శ్రమశక్తి ఎక్కడా లేదని తెలిపారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగం కల్పించాల్సిన ప్రభుత్వం కాకి లెక్కలతో కాలం గడుపుతోందని, వికసిత్ ఇండియా కాదని స్కామ్ ఇండియా అని విమర్శించారు. అమెరికా, చైనా, జర్మనీ కొరియా విదేశాల్లో 65 నుండి 80 శాతం యువత శిక్షణ పొంది ఉద్యోగం చేస్తుంటే మనదేశంలో నాలుగు శాతం మందికి మాత్రమే శిక్షణ ఇస్తున్నారన్నారు. కాగ్ నివేదికలో 95 శాతం మంది యువతకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారని, వాస్తవంగా అకౌంట్లు పరిశీలిస్తే మొత్తం నకిలీవని తేలిందని వివరించారు. దేశంలో కార్మిక శక్తి ఉన్నప్పటికీ దాని వినియోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో 83 శాతం మంది నిరుద్యోగ యువకులు ఉన్నారని తెలిపారు. డాక్టర్ శేషారెడ్డి ఆశయాలను కొనసాగిం చాల్సిన అవసరం నేటి సమాజంపై ఎంతో ఉందని, ప్రశ్నించడం, పోరాడడమే ఆయనకు ఆర్పించే నివాళని పేర్కొన్నారు. ఈ సదస్సుకు పిపిసి సీనియర్ వైద్యులు డాక్టర్ అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు.
చరిత్రను చెరిపేయలేరు : ప్రముఖ రచయిత దేవరాజు మహారాజు
మనదేశానికి ఎంతో చరిత్ర ఉందని, దీనిని చెరిపేయాలని ప్రస్తుత పాలకులు ప్రయత్నిస్తు న్నారని, దీనిని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని, ప్రముఖ రచయిత దేవరాజు మహారాజు అన్నారు. ఆధునిక భారతం -శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రపంచానికి శాస్త్రాన్ని నేర్పిన భారత్ ఇప్పుడు అశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని, అందుకు పాలకుల విధానాలే కారణమని వివరించారు. దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది అప్పటి ప్రధాని నెహ్రూ అని, ఆయన జ్ఞాపకాలను తొలగించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని, ఎన్నో వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ సదస్సుకు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సుల్లో మాజీ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గేయానంద్, పిపిసి సూప రింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి.రమణయ్య. ప్రముఖ వైద్యులు డాక్టర్ నారాయణరావు. జెఎస్ ట్రస్ట్ చైర్మన్ చండ రాజ గోపాల్, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు సతీష్ కుమార్ పాల్గొన్నారు. తొలుత శేషారెడ్డి చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.








కామెంట్‌లు (0)