test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుజరాత్‌లో ఘోర ప్రమాదం

19 మే, 2026

road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 10:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గుజరాత్‌: గుజరాత్‌లోని ద్వారకా-లింబ్డి రహదారిపై జరిగిన విషాద ఘటనలో కారుకు అకస్మాత్తుగా నిప్పంటుకోవడంతో తండ్రీకూతుళ్లు సజీవ దహనం అయ్యారు. రంజిత్‌పర్‌కు చెందిన వల్లభాయ్ సువా, ఆయన కుమార్తె హిరల్‌బెన్ సువా ఈ ప్రమాదంలో మృతి చెందగా, వల్లభాయ్ భార్య సతీబెన్ సువా గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణంలో ఉండగానే మంటలు వేగంగా వ్యాపించి వాహనం మొత్తాన్ని ఆవరించాయి. మంటలు చెలరేగిన సమయంలో కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పనిచేయకపోవడంతో వల్లభాయ్, హిరల్‌బెన్ తలుపులు తెరవలేక వాహనంలోనే చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన సతీబెన్‌ను ఖంభాలియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్