test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న హర్మన్ ప్రీత్ కౌర్

25 మే, 2026

padma award
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 11:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ "పద్మశ్రీ" అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. క్రీడా రంగం నుండి హర్మన్‌ప్రీత్ కౌర్ తో సహా పలువురు ప్రముఖులకు పద్మ పురస్కారాలు లభించాయి. భారత పురుషుల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ లభించినా హాజరు కాలేదు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్‌కు పద్మభూషణ్, బల్‌దేవ్ సింగ్, భగవాన్‌దాస్ రాయ్‌క్వార్, కె. పంజనీవేల్, ప్రవీణ్ కుమార్, సవితా పునియాకు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. భారత క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన హర్మన్‌, గత 17 ఏళ్లుగా జాతీయ జట్టుకు సేవలందిస్తూ అనేక చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్‌కు కొత్త గుర్తింపు వచ్చింది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో హర్మన్‌తో పాటు భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మకు కూడా పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. ప్రపంచకప్ విజయాలు సాధించిన ఇద్దరు కెప్టెన్లు ఒకే ఏడాది ఈ గౌరవాన్ని పొందడం భారత క్రికెట్‌కు అరుదైన ఘట్టం. క్రికెట్‌కు సంబంధించి గతంలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్