test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇక చాలు..దిగిపోండి !

5 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 11:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇప్పటికే 1.33 లక్షల మంది వర్శిటీ విద్యార్థుల సంతకాలు
న్యూఢిల్లీ : ప్రశ్నాప్రతాల వరుస లీకేజీలు, జాతీయ విద్యా వ్యవస్థల్లో అక్రమాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని ‌భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్‌ ‌చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆఫ్‌‌లైన్‌‌లోనూ, ఆన్‌‌లైన్‌‌లోనూ ‘ఇక చాలు’ (ఎనఫ్‌ఈజ్‌ఎనఫ్‌) ‌దిగిపోండి అంటూ ప్రచారోద్యమం చేపట్టి విద్యార్థులు, యువత నుంచి సంతకాలు సేకరిస్తోంది. ఇందుకోసం
https://enoughisenough.sficec.in/ అనే ప్రత్యేక వెబ్‌ సైట్‌ ‌కూడా ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం నాటికి ఇందులో 1,33,970 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు, యువత.. ధర్మేంద్ర రాజీనామా చేయాలంటూ రూపొందించిన ప్రత్యేక ఆన్‌‌లైన్‌ ‌పిటిషన్‌‌పై సంతకాలు చేశారు. 628 జిల్లాలకు ఈ ప్రచారం విస్తరించింది. ఇందుకు సంబంధించిన ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొనేవారికి సేవలందించేందుకు 54,672 మంది వలంటీర్లుగా చేరారు. దేశ విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ ప్రచారోద్యమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.


ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన డిమాండ్లు
- విద్యా వ్యవస్థలో వినాశకర చర్యలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలి.
- జాతీయ పరీక్షా ఏజెన్సీ (ఎన్‌‌టిఎ)ని రద్దు చేయాలి.
- పరీక్షలను వికేంద్రీకరించాలి.
- సిబిఎస్‌ఇ పరీక్షలలో ఒఎస్‌ఎం మూల్యాంకన విధానాన్ని ఉపసంహరించుకోవాలి.
- నీట్‌ ‌కుంభకోణంపై స్వతంత్ర న్యాయ విచారణ చేపట్టాలి.
- ఈ కుంభకోణంలో ప్రమేయమున్న బిజెపి నేతలతో సహా దోషులందరినీ కఠినంగా శిక్షించాలి.
- బాధిత విద్యార్థులందరికీ న్యాయమైన పరిహారం చెల్లించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్