test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మౌలిక సదుపాయాల అభివృద్ధిపై శ్రీలంక దృష్టి

3 గంటల క్రితం

sl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 11:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొలంబో : దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని శ్రీలంకలోని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మూల ధన వ్యయం పద్దు కింద వచ్చే సంవత్సరం 2027లో రూ.2 లక్షల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపింది. ప్రధానంగా రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు శ్రీలంక ఆరోగ్య, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి నలిందా జయతిస్సా తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది రూ.1.35 లక్షల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెరగడం, ఎగుమతులు, చెల్లింపులు, పర్యాటక ఆదాయాల ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా చేపట్టడానికి వెసులుబాటు కుదిరిందని చెప్పారు. అలాగే వచ్చే ఏడాది ప్రభుత్వ రంగ వేతనాలు పెంచే యోచన కూడా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలపై ఆర్థిక ఒత్తిళ్ళను సడలించేందుకు, కుటుంబ ఆదాయాలు మరింత పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. 2025లో కూడా ప్రభుత్వం కనీస నెలవారీ వేతనాలను రూ.24,250 నుండి రూ.40వేలకు పెంచిందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్