test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాంతి ఒప్పందంపై సంతకంపై `తుది నిర్ణయం’ ఖరారు కాలేదు : ఇరాన్

2 గంటల క్రితం

Iran media says Tehran 'not yet' taken final decision
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 04:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

టెహ్రాన్ :   పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో చర్చల్లో ఉన్న ఒప్పందంపై సంతకంపై తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదని ఇరాన్ మీడియా ‘ఫార్స్’ వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. “చర్చల సమయంలో ప్రతిపాదించిన అవగాహన ఒప్పందానికి సంబంధించి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇంకా తన తుది నిర్ణయాన్ని తీసుకోలేదు లేదా ప్రకటించలేదు” అని ఇరాన్ చర్చల బృందానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక వర్గం వెల్లడించినట్లు మీడియా తెలిపింది. ఖతార్ ప్రతినిధి బృందం ఆదివారం టెహ్రాన్‌కు చేరుకుందని మరో ఇరాన్ మీడియా తస్నీమ్ పేర్కొంది. ఖతార్ విదేశాంగ మంత్రి సలహాదారు ఒకరు ఇరాన్‌కు చేరుకున్నారని, దౌత్యపరమైన ప్రక్రియకు సంబంధించిన తాజా పరిణామాలను సమీక్షించడం ఈ పర్యటన ఉద్దేశమని తెలిపింది.

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో ఒక ఒప్పందంపై ఆదివారం సంతకాలు జరుగుతాయని, ఆ వెంటనే వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ‘హోర్ముజ్ జలసంధి’ అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఒప్పందంపై సంతకం చేసే తేదీ ఇంకా ఖరారు కాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి పేర్కొన్నారు. అదే సమయంలో భవిష్యత్తులో సంతకం చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఆయన అన్నారు.

లెబనాన్ లో 29 గ్రామాలకు హెచ్చరికలు : ఇజ్రాయిల్ సైన్యం 
లెబనాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోని 29 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది. దాడులకు ముందు సైన్యానికి చెందిన అరబిక్ భాషా ప్రతినిధి కల్నల్ అవిచాయ్ వరుసగా రెండు హెచ్చరికలు జారీ చేశారు. మొదట 13 గ్రామాలను, అనంతరం మరో 16 గ్రామాలను హెచ్చరించారు. జహ్రానీ నదికి ఉత్తరాన ఉన్న కమ్యూనిటీలు లక్ష్యంగా రెండవ హెచ్చరికను జారీ చేశారు. లెబనాన్ కి చెందిన హెజ్బుల్లా గ్రూప్ రెండు డ్రోన్ లను ప్రయోగించిందని ఇ్రజాయిల్ మిలటరీ ఆదివారం తెలిపింది. ఇవి ఉత్తర ఇజ్రాయిల్ ను తాకాయని, కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్