న్యూఢిల్లీ : జెఇఇ (అడ్వాన్స్డ్) అభ్యర్థుల డేటా లీకైందని, గోప్యతా ఉల్లంఘటన జరిగిందని వచ్చిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవి, అవాస్తవమని ఐఐటి రూర్కీ శుక్రవారం స్పష్టం చేసింది. తాత్కాలిక క్లౌడ్ స్టోరేజీ తప్పు కాన్ఫిగరేషన్ జరిగిందని తెలిపింది. అయితే ఎటువంటి సమాచారం బయటకు రాలేదని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటిలు, అనేక ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఇఇ (అడ్వాన్స్డ్ ) పరీక్షను ఈ ఏడాది ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), రూర్కీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అడ్మిట్-కార్డ్ డేటాను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు సహాయం చేయడానికి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం జూన్ 2న కొన్ని సాంకేతిక చర్యలు చేపట్టామని సంస్థ పేర్కొంది. దీంతో క్లౌడ్-స్టోరేజ్ కాంపోనెంట్లో “చిన్నపాటి తప్పు కాన్ఫిగరేషన్” ఏర్పడిందని, దీనిని హ్యాకర్స్ గుర్తించారని, సమస్యను పరిష్కరించారని తెలిపింది.
జెఇఇ (అడ్వాన్స్డ్) పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించిన డేటా ఉల్లంఘన, గోప్యతా ఉల్లంఘనలపై అనేక తప్పుదోవ పట్టించే, వాస్తవ విరుద్ధమైన నివేదికలు వచ్చాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమాచారం లీక్ కాలేదని, పరీక్షా ఫలితాలు, మార్కులు, అభ్యర్థి సమాచారం పూర్తిగా సురక్షితంగా, భద్రంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
జెఇఇ (అడ్వాన్స్డ్) అభ్యర్థుల డేటా లీక్ వార్తలు అవాస్తవం
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 05:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)