test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు – ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

11 మే, 2026

ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు – ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 03:09 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

చిత్తూరు : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేసి , అతడు ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు చేసిన 30 ప్రింటర్లు, 3 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీసు అధికారి ఈ వివరాలను వెల్లడించారు. ముద్దాయిపై చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో 18 కేసులున్నాయి. ఈరోజు ఐపిఎస్ ఆదేశాల మేరకు …. చిత్తూరు జిల్లా ఎస్‌పి తుషార్ డూడి, నగరి ఇన్‌చార్జ్ డీఎస్పీ జె.రామ్‌బాబు పర్యవేక్షణలో, కార్వేటినగరం సిఐ, ఎస్‌.ఆర్‌.పురం ఎస్‌ఐ, సిబ్బంది ఎస్‌.ఆర్‌.పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తూరు–తిరుపతి ప్రధాన రహదారిపై మఠం క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడు సి.మహేష్‌బాబు (22) తండ్రి దొరబాబు, స్వగ్రామం కన్యాకాపురం గ్రామం, ఎస్‌.ఆర్‌.పురం మండలం, ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నాడు. అతని వద్ద ఒక ప్రింటర్ ఉండగా, పోలీసులు తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను పలు ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతని వద్ద నుండి 30 దొంగిలించిన ప్రింటర్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ సచివాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. కట్టర్ సహాయంతో కార్యాలయాల తలుపులు పగులగొట్టి ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించేవాడు. దొంగిలించిన వస్తువులను అమ్మి వచ్చిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్, విలాసవంతమైన జీవనానికి ఖర్చు చేసేవాడు. దొంగిలించిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లను OLX యాప్‌లో సెకండ్ ‌హ్యాండ్ వస్తువులుగా అప్‌లోడ్ చేసి తక్కువ ధరలకు విక్రయించేవాడు. తక్కువ ధరలకు లభించడంతో కొనుగోలుదారులు సులభంగా కొనుగోలు చేసేవారని విచారణలో తెలిసింది.

ముద్దాయి వివరాలు …
సి. మహేష్‌బాబు, వయస్సు 22 సంవత్సరాలు, తండ్రి దొరబాబు, కన్యాకాపురం గ్రామం, ఎస్‌.ఆర్‌.పురం మండలం, ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నాడు.
విచారణలో అతని ప్రమేయం మొత్తం 18 కేసుల్లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను చేసిన అంతర్‌జిల్లా నేరాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి …
చిత్తూరు జిల్లా – 12 కేసులు
ఎస్‌.ఆర్‌.పురం మండలం – 05 కేసులు
1. కొత్తపల్లి మిట్ట
2. నెలవాయి
3. శెట్టివానతం
4. ముడికుప్పం
5. కొత్తపల్లి మిట్ట ఆర్‌ఎస్‌కే
6. ఏ.ఎం.పురం సచివాలయం
వేదురుకుప్పం మండలం – 03 కేసులు
1. బ్రాహ్మణపల్లి
2. తిరుమలయ్యగారి పల్లి
3. పాతగుంట సచివాలయం
గుడిపాల మండలం – 02 కేసులు
1. మరకలకుప్పం
2. ఏ.ఎల్‌.పురం
3. పేయినపల్లి సచివాలయం
జీడీ నెల్లూరు మండలం – 02 కేసులు
1. చిన్నవేపంజేరి
2. అగరమంగళం మరియు పెద్దకాలువ
తిరుపతి జిల్లా – 05 కేసులు
పాకాల మండలం – 03 కేసులు
1. పుదిపట్ల బైలు
2. వల్లివేడు
3. పంతపల్లి సచివాలయం
వడమాలపేట మండలం – 01 కేసు
1. పూడి సచివాలయం
ఎం.ఆర్‌.పల్లి పోలీస్ స్టేషన్ పరిధి – 01 కేసు
1. మల్లంగుంట సచివాలయం
అన్నమయ్య జిల్లా – 01 కేసు
1. పీలేరు మండలం, దొడ్డిపల్లి సచివాలయం
మొత్తం రూ.6,50,544/- విలువైన 30 ప్రింటర్లు, రూ.1,59,866/- విలువైన 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం దొంగసొత్తు విలువ సుమారు రూ.8,10,400/- గా అంచనా వేశారు.

నిందితుడు మహేష్‌బాబును 11-05-2026 తేదీ ఉదయం 06.00 గంటలకు అధికారికంగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి నేరాలకు ఉపయోగించిన కట్టర్, AP39MR0240 నంబర్ గల గ్లామర్ మోటార్ సైకిల్, సుమారు 30 హెచ్‌పీ మరియు ఎప్సన్ కంపెనీ ప్రింటర్లు, మూడు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

విచారణలో నిందితుడు ఇంజినీరింగ్ విద్యార్థి అయినప్పటికీ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై, సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలిస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

ఈ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన కార్వేటినగరం సీఐ వై. హనుమంతప్ప, ఎస్‌.ఆర్‌.పురం ఎస్‌ఐ వి. సుమన్, సిబ్బంది పీసీలు లోకనాథం, రాజశేఖర్, బాలయ్య, శరత్, వజ్రవేలు, యువరాజ్‌లను చిత్తూరు జిల్లా ఎస్‌పీ తుషార్ డూడి, IPS అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్