ఉత్సాహంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం
ఆకట్టుకున్న మహా ప్రదర్శన
వేలాదిమంది కార్మికులతో ఎరుపెక్కిన అమలాపురం
ప్రజాశక్తి -అమలాపురం రూరల్ (కోనసీమ) : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభలు అమలాపురం పట్టణంలో సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎర్రజెండాలతో పట్టణ వీధులు రెపరెపలాడాయి. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం ఈదరపల్లి వంతెన నుంచి మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వేలాదిమంది వ్యవసాయ కార్మికులు తమ డిమాండ్లను నినదించారు. ఈ మహా ప్రదర్శనలో కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్, అధ్యక్షులు ఏ విజయ రాఘవన్, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే లోకనాథం వి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు గడాల సుబ్రమణ్యం చైతన్య అగ్ర భాగాన నిలిచి ప్రదర్శన ముందుకు నడిపించారు. 30వ కవాతు చేశారు. మహాసభలు సందర్భంగా 30 జండాలతో రెడ్ సారీ వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాదిమంది కార్మికులతో ఎదరపల్లి వంతల నుంచి మెయిన్ రోడ్డు మీదగా గణేష్ స్థలం వరకు నిర్వహించిన మహా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు అత్యధిక మంది జనాభా హాజరవడంతో గడియారం స్తంభం సెంటర్ వ్యవసాయ కార్మికులతో కిటకిటలాడింది.








కామెంట్లు (0)