test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు ..నేపాల్ విమానాశ్రయం మూసివేత

11 మే, 2026

Turkish Airlines jet catches fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఖాట్మాండు : టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. సోమవారం నేపాల్ లోని ప్రధాన విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

వివరాల ప్రకారం.. సుమారు 277మంది ప్రయాణికులతో ఎయిర్ బస్ 330 జెట్ ఇస్తాంబుల్ నుండి బయలుదేరింది. ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కుడి ల్యాండింగ్ గేర్ పై మంటలు చెలరేగడంతో, దట్టమైన పొగ అలుముకుంది. అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. విమానాశ్రంయలో ఒకే ఒక రన్ వే ఉండటంతో .. క్లియర్ చేసేందుకు ప్రమాదం అనంతరం విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. దీంతో ఖాట్మాండుకు వెళ్లాల్సిన అనేక విమానాలను నిలిపివేశారు.

2015లో, ఖాట్మాండులో దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అవుతున్న సమయంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం రన్ వేనుండి పక్కకు జారిపోయింది. దీంతో విమానాశ్రయాన్ని కొన్ని రోజుల పాటు మూసివేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్