
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ చెన్నై షాపింగ్ మాల్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. దీనిని సినీనటి మృణాల్ ఠాకూర్ ప్రారంభించి షాప్ అంతా తిరిగి సందడి చేశారు. 29వ షోరూంను కాకినాడలో ఏర్పాటు చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని యజమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ …. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు విస్తరించిన చెన్నై షాపింగ్ మాల్ వస్త్ర ప్రపంచం నేడు కాకినాడ గుమ్మంలో కొలువు తీరిందన్నారు. పట్టు ఫ్యాన్సీ, రెడీమేడ్ ఒకటేమిటి లక్షల డిజైన్లు ఇప్పుడు సరికొత్త హంగులతో మగువల మనసు దోచే కంచి పట్టు చీరల వరకు అన్ని వెరైటీలు అందుబాటులోకి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వనమాడి ఉమా శంకర్, షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎం వెంకటరెడ్డి, కృష్ణ రావు, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)