‘స్పిరిట్’ పేరుతో తెరకెక్కుతున్న రెండు సినిమాలు వివాదంలోకి వెళ్లాయి. ఒరిజినల్ టైటిల్ తమదంటే తమదంటూ ఇద్దరు దర్శకులు ఇప్పుడు పోటీపడుతున్నారు. ఒకటి భారీ బడ్జెట్ సినిమా కాగా, మరో సినిమా స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది. కాగా, ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ‘స్పిరిట్: ఈజ్ నాట్ వన్’ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టైటిల్ వివాదం తెరపైకి వచ్చింది. రెండు సినిమాల ప్రతినిధులను ఫిలిం చాంబర్ ప్రతినిధులు పిలిచి చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.








కామెంట్‌లు (0)