test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

TG EdCET-2026 తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

30 మే, 2026

TG EdCET-2026: Telangana EdCET Results Released
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాల విడుదలయ్యాయి. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు టీజీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిలు విడుదల చేశారు. కాకతీయ యూనివర్సిటీ తరఫున తెలంగాణ కౌన్సెల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ఫలితాలు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 12న ఎడ్ సెట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా…29342 మంది పరీక్షకు హాజరయ్యారు. బానోత్ అజిత్ సాయి ఎడ్ సెట్ లో మొదటి ర్యాంకు సాధించారు.

రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్‌ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నాం 12:30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిలు ఫలితాలు విడుదల చేశారు. ఎడ్‌సెట్‌ పరీక్షను ఈ నెల 12న నిర్వహించగా 84% మంది పరీక్షకు హాజరైన సంగతి తెలిసిందే. మే 12న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వివిధ సెక్షన్లలో అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్ష అనంతరం ప్రాథమిక కీ విడుదల అయ్యింది. అనంతరం ఫైనల్ ఆన్సర్‌కి అందుబాటులోకి ఉంచింది. తర్వాత అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్, మెుంబైల్ నంబర్ లేదా పుట్టిన తేదీని ఉపయోగించి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ edcet.tgche.ac.inలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అర్హత సాధించిన అభ్యర్థులు త్వరలోనే వచ్చే కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొని సీట్లు పొందే అవకాశం ఉంది. ర్యాంక్ కార్డుల ఆధారంగా కాలేజీలు, సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇకపోతే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పోటీ మరింత తీవ్రంగా ఉంది.అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంక్, క్వాలిఫైంగ్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్