
అమరావతి : ఎపి ఎడ్‌సెట్ -2026 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 19,880 మంది పరీక్షకు హాజరుకాగా.. 19,741 మంది (99.3 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. http://Cets.apsche.ap.gov.in లింక్ లో అభ్యర్థులు వారి హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనగలరు. వారికి ఏపీఈఈడీఈసీఈటీఈపీ ర్యాంక్ కార్డు జారీ చేసే అవకాశం ఉంది. జనరల్, బిసి అభ్యర్థులకు 38 మార్కులు (25%) అవసరం.
AP EdCET 2026 – ఎపి ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల
26 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 26, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)