ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడా మండలంలోని సోంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరొకసారి విద్యా ప్రమాణాలను చాటిచెప్పిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ బి.పి. ఏ .రాజు తెలియజేశారు. 2026 మార్చ్ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 600 కు గాను 574 మార్కులతో మండల త్రితీయ స్థానం సాధించి పలువురి ప్రశంసలు అందుకున్న కోరుబిల్లి స్వరూప ఈ విజయానికి మరో మైలురాయిగా ఇటీవల ప్రకటించిన RGUKT IIIT జెనరల్ కేటగిరీ లో శ్రీకాకుళం క్యాంపస్ లోకి ఎంపిక చేయబడింది. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి కూలి పనులతో కార్పొరేట్ ఉన్నత చదువులు పొందే అవకాశం లేకపోగా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తన పట్టుదలలే పునాదిగా సాధించిన ఈ విజయం గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల ప్రతిభకు నిదర్శనమని “పట్టుదల, లక్ష్యం ఉంటే ఉచిత విద్యే ప్రోత్సాహకంగా ప్రభుత్వ పాఠశాలలే ఉన్నత శిఖరాలకు నిచ్చెనలని ” చెప్పడానికి స్వరూపే నిదర్శనమని చెబుతూ ఇంచార్జ్ శ్రీ వి జగన్నాదరావు, శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది మరియు గ్రామ పెద్దలు ఈ విద్యార్థిని అభినందించారు. ఈ స్ఫూర్తి తో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ సదుపాయాలతో పాటు ఈ పాఠశాల ప్రత్యేక అవకాశాలైన స్కౌట్స్& గైడ్స్, నగదు ప్రోత్సాహకాలు తదితర సదుపాయాలను తమ పిల్లలకు అందించాలని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కోరుతున్నారు.
IIIT సాధించిన సోంపురం ఉన్నత పాఠశాల విద్యార్థిని
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)