ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మన్న ఒక ప్రకటనలు తెలిపారు. ఆదివారం మండల కేంద్రమైన కలకడ సర్కిల్ కార్యాలయంలో ప్రజాశక్తితో ఆయన మాట్లాడుతూ …. మండలంలోని గ్రామాలలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించిన ఎడల స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. అదే విధంగా మీకు సంబంధించిన వస్తువులు కాకుండా వేరే వారి వస్తువులు కనిపించిన ఎడల వాటిని తాకకుండా, తీసుకెళ్లకుండా గుర్తించిన వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించినట్లు తెలిపారు. తమకు పరిచయం లేని వ్యక్తులు గ్రామంలో పర్యటించినచో వారి కదలికలను గమనించి వారి ప్రవర్తన మార్పు ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. యజమానులేని బ్యాగులు బాక్సులు వస్తువులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాంటివాటిని స్వయంగా పరిశీలించే ప్రయత్నాలకుల చేయరాదని తెలియజేసినట్లు తెలిపారు. ఒకవేళ అలాంటి వస్తువులు కనిపించిన ఎడల 100 లేక 112 కు సమాచారం అందించాలన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి : సిఐ లక్ష్మన్న
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)