ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సమాజ సేవలో శింగనమల నియోజకవర్గం, నార్పల పేరు రాష్ట్ర చరిత్ర పుటల్లోకెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా …. నార్పలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తం ఇచ్చిన ఏకైక కేంద్రంగా నిలిచి, రాష్ట్రంలోనే మన శింగనమల నియోజకవర్గం, నార్పల మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజానాథ్ సమక్షంలో, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. జగనన్న పై ఉన్న అభిమానంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలివచ్చి భారీ ఎత్తున రక్తదానం చేయడంతో ఈ అపూర్వ రికార్డు సాధ్యమైంది.రెడ్ క్రాస్ సొసైటీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ సేవా కార్యక్రమానికి గానూ నార్పలకు అధికారికంగా రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ఈ నెల 14వ తేదీన (ఆదివారం) ఏలూరులో నిర్వహించబోయే “ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డుల దినోత్సవం” వేడుకల్లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సత్యనారాయణ రెడ్డి అందుకున్నారు. శింగనమల నియోజకవర్గం కి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల డాక్టర్ సాకే శైలజానాథ్, నార్పల సత్యనారాయణ రెడ్డి, హర్షం వ్యక్తం చేశారు. ప్రాణదాతలుగా నిలిచి శింగనమల నియోజకవర్గం, నార్పల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిచెప్పిన ప్రతి ఒక్క రక్తదాతకు, యువతకు, వైఎస్సార్‌సీపీ సైనికులకు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వైద్య సిబ్బందికి మండల కన్వీనర్ ఖాదర్ వలీ ఖాన్ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు రావడం శింగనమల నియోజకవర్గానికే గర్వకారణమని అన్నారు..
రెడ్ క్రాస్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. రాష్ట్రంలోనే నార్పల రక్తదాన శిబిరానికి ప్రథమస్థానం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 03:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)