test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెట్రోల్ బంక్ ల్లో బల్క్ కొనుగోళ్లపై నిషేధం

2 రోజుల క్రితం

purchasing petrol, diesel from retail outlets
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పెట్రోల్ బంక్ ల నుండి పెట్రోల్, డీజిల్ భారీ  కొనుగోళ్లపై  ప్రభుత్వం నిషేధం విధించింది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్ లెట్ల నుండి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకూడదని, వాటిని ప్రత్యేక సరఫరా మార్గాల్లోనే పొందాలని గురువారం ఆలస్యంగా విడుదల చేసిన ఉత్తర్వులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక వినియోగదారుడికి గాని, ఒక వాహనానికి గాని రోజుకి 200 లీటర్లకు మించి డీజిల్ ను విక్రయించకూడదని రిటైల్ అవుట్ లెట్లను ఆదేశించింది. ఈ నిషేధం 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని, పరిస్థితులను అనుసరించి గడువును పొడిగించే అవకాశం ఉందని తెలిపింది. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో నెలకొన్న అసాధారణ పెరుగుదలను అరికట్టడమే ప్రధాన ఉద్దేశ్యమని ఉత్తర్వుల్లో పేర్కొంది.  పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన ధరలు భారీగా పెరగడం, పారిశ్రామిక/వాణిజ్య, రిటైల్ వర్గాల మధ్య ధరల వ్యత్యాసం ఉండటం, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు సైతం రిటైల్ అవుట్‌లెట్ల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడంతో ఇటీవల ఇంధన విక్రయాల్లో పెరుగుదల కనిపించిందని పేర్కొంది. భారీ కొనుగోళ్లు సైతం రిటైల్ కేంద్రాల వైపు మళ్లడంతో మే 27న బల్క్ విక్రయాల్లో దాదాపు 29శాతం తగ్గుదల నమోదైందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలోరిటైల్ కేంద్రాల్లో ఇంధన విక్రయాలు పెరిగినట్లు గుర్తించామని వెల్లడించింది. బల్క్ కొనుగోళ్లు, రిటైల్ కేంద్రాల్లో ఇంధన ధరల్లో వ్యత్యాసం అధికంగా ఉందని వెల్లడించింది. రిటైల్ కేంద్రాల కన్నా బల్క్ కొనుగోళ్లలో డీజిల్ పై లీటరుకు రూ.40 అదనపు ధర చెల్లించాల్సి వుందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్