test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో యువతి ఆత్మహత్యాయత్నం!

3 గంటల క్రితం

gunter suside
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 02:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు: గ్రీవెన్స్‌కు వచ్చిన ఓ యువతి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు కలెక్టరేట్ వేదికగా సోమవారం చోటు చేసుకుంది. తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన కే. నాని అనే యువతి, అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తండ్రి, బాబాయ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా ఆమెను, ఆమె తల్లిని తీవ్రంగా వేధిస్తున్నారు. అంతేకాకుండా, ఆమె తల్లి దగ్గర నుంచి 15 సవర్ల బంగారం, 5 లక్షల రూపాయల నగదును బలవంతంగా లాక్కొని, వారిద్దరినీ ఇంటి నుంచి బయటకు నెట్టేసారని.. తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారని, తమని పట్టించుకోకుండా మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగింది. అక్కడున్న అధికారులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్