test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం: ఒకే ఇంట్లో ముగ్గురు ఉరివేసుకొని ఆత్మహత్య!

5 గంటల క్రితం

suside
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 10:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను విశ్రాంత ఉపాధ్యాయుడు (రిటైర్డ్ టీచర్) మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నావళి, మరియు వారి కుమారుడు సాయి సుకృత్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాల కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్