test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మణిపూర్ లో మరోసారి చెలరేగిన హింస.. ఇద్దరు కుకీలు మృతి

4 గంటల క్రితం

Two killed in fresh Manipur violence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంఫాల్ :   మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది. గుర్తు తెలియని సాయుధ దుండగుల దాడిలో ఒక మహిళ సహా ఇద్దరు కుకీలు మరణించినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామ్ జోంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈఘటన జరిగిందని అన్నారు. భారత్-మయన్మార్ సరిహద్దులోని కామ్ జోంగ్ జిల్లా కులుత్ గ్రామంలో ఇద్దరు కుకీలు మరణించినట్లు ఇంఫాల్ అధికారులు ధృవీకరించారు. మరో ఇద్దరు గాయపడ్డారని అన్నారు. నాగా గ్రూప్ దాడికి పాల్పడినట్లు ఈస్టర్న్ కుకీ చీఫ్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. చర్చీ సహా ఏడు నివాసాలకు నిప్పుపెట్టారని, దీంతో ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు.

బంధీలుగా తీసుకువెళ్లిన ఆరుగురు నాగాలను హత్య చేశారన్న ఆరోపణలపై మే 13న సేనాపతి జిల్లాలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. సేనాపతి, కామ్ జోంగ్ రెండు జిల్లాలు కూడా నాగా ప్రాబల్యం ఉన్నవి. అయితే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ప్రాంత ఆధిపత్యం కోసం సాయుధ కుకీ గ్రూప్, మరో కుకీ తీవ్రవాద గ్రూపుల మధ్య ఘర్షణ కొనసాగుతోందని ఈస్టర్న్ కమాండ్ నాగా విలేజ్ గార్డ్ ఆరోపించింది. దాడిచేసిన కుకీ గ్రూప్ లలో ఒకటి మయన్మార్ కు చెందినదని ఆ సంస్థ పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్