test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేణిగుంట విమానాశ్రయంలో డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం

3 గంటల క్రితం

Grand welcome for Deputy CM Pawan Kalyan at Renigunta Airport.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి జిల్లాలో ఒక్క రోజు పర్యటన కోసం …. శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఆయనకి జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, చిత్తూరు ఏం పి దగ్గుమల్ల ప్రసాదరావు. తిరుపతి, కాళహస్తి, కోడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు బొజ్జల సుధీర్ రెడ్డి అరవ శ్రీధర్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ హరి ప్రసాద్, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి, కోటం ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తదితరులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన దామినేడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్