test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అలా అయితేనే రాజకీయ ప్రయాణం.. లేదంటే : లారెన్స్

3 గంటల క్రితం

Only then will the political journey happen... otherwise: Lawrence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 12:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తమిళనాడు : ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన రాఘవ లారెన్స్ తన రాజకీయ ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను విడుదల చేస్తూ, ప్రజలు , అభిమానుల మద్దతు ఉంటేనే తాను రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రవేశంపై ప్రజల సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వాన్ని ఆయన కోరారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, లారెన్స్ అత్యంత ఆప్తమిత్రుడు అయిన సినీనటుడు విజయ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత ఖాళీ చేసిన ‘తిరుచ్చి ఈస్ట్’ నియోజకవర్గం ఉప ఎన్నిక నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లారెన్స్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి విజయ్ గడిచిన ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో, సచివాలయానికి సమీపంలో ఉండే పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. విజయ్ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచే లారెన్స్ బరిలోకి దిగుతారనే వార్తలకు తాజా ప్రకటన మరింత బలాన్ని చేకూర్చింది. రాజకీయాల్లోకి రావడం, డబ్బు సంపాదించడం లేదా పదవులు అనుభవించడం తన ఉద్దేశం కాదని లారెన్స్ స్పష్టం చేశారు. తాను నమ్మిన, తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, ఆయనకు అండగా ఉంటూ సమాజానికి మరింత విస్తృతంగా సేవ చేయాలనేదే తన ఆలోచన అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయని చెప్తూ.. తన రాజకీయ అవగాహన, తన జీవితంలోకి రాజకీయాలు ఎలా వచ్చాయి, రాజకీయాలపై తన తల్లిగారి అభిప్రాయం వంటి ఆసక్తికరమైన విషయాలను ఆ వీడియోలో పంచుకున్నారు. నిస్వార్థంగా సేవ చేయడమే తన కర్తవ్యమని, ప్రజలు ఈ వీడియోను పూర్తిగా చూసి తమ అభిప్రాయాలను పంచుకోవాలని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. రాఘవ లారెన్స్ తమిళ, తెలుగు చిత్రసీమలో కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా, గత కొన్ని దశాబ్దాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, వికలాంగులకు, పేద పిల్లలకు సహాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు. విజయ్, లారెన్స్ ఇద్దరూ ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహితులు. ఇప్పుడు విజయ్ స్థాపించిన రాజకీయ ప్రయాణంలో లారెన్స్ కూడా భాగస్వామి కాబోతుండటం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్