test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండోసారి సిఐడి విచారణకు హాజరైన అభిషేక్ బెనర్జీ

4 గంటల క్రితం

Abhishek Banerjee reaches CID headquarters for questioning
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 01:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నియామకానికి సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై, టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ రెండోసారి సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయం ఆయన కోల్ కతాలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. గతవారం జరిగిన విచారణలో అభిషేక్ బెనర్జీ ఇచ్చిన సమాధానాలపై సిఐడి అధికారులు సంతృప్తి చెందలేదని, అందుకే ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం విచారణకు హాజరుకావాల్సిందిగా మరో టిఎంసి ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కు కూడా సిఐడి సమన్లు జారీ చేసిందని, విచారణలో భాగంగా ఇరువురు నేతలను ముఖాముఖీ ప్రశ్నించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కునాల్ మధ్యాహ్నం 3.00 గంటలకు భబానీ భవన్ లోని సిఐడి విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి నిర్దిష్ట ప్రతాలను సమర్పించాల్సిందిగా అభిషేక్ బెనర్జీని కోరామని సిఐడి తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్