ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : హోం గార్డుల కోసం సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం విశాఖ నగర పోలీస్ కమిషనరేట్‌లో ప్రారంభించారు. హోం గార్డులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా పాలసీ పట్టాలను అందజేశారు. విశాఖ సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో దేశంలోనే తొలి వినూత్న సంక్షేమ కార్యక్రమంగా ఈ పథకాన్ని అమలు చేశారు. అధిక ఒత్తిడి, ప్రమాదాలను ఎదుర్కొంటూ సేవలందిస్తున్న హోం గార్డులు తీవ్రమైన అనారోగ్యంతో, భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విశాఖలోని ప్రతి హోం గార్డు కుటుంబానికి రూ.3 లక్షల బేస్ పాలసీతో పాటు రూ.30 లక్షల టాప్-అప్ కవరేజ్, అదనంగా రూ.3 లక్షల కాంప్లిమెంటరీ కవరేజ్ కల్పిస్తారు. మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం లభించనుంది. హోం గార్డుల భార్య లేదా భర్తతో పాటు ఇద్దరు పిల్లలకు ఈ బీమా వర్తిస్తుంది. దివీస్ లేబొరేటరీస్ సంస్థ నగర పోలీస్ శాఖకు రెండు ఎల్‌ఎంవి వాహనాలను అందజేసింది.
Print Editionహోం గార్డులకు సమగ్ర ఆరోగ్య బీమా పథకం ప్రారంభం
22 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 22, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)