test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతొలి నెలలోనే ఆర్థిక తడబాటు

27 మే, 2026

debits
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఏప్రిల్‌‌లో రాష్ర్ట ఆదాయం రూ.12 వేల కోట్లు

  • అప్పు రూ.11 వేల కోట్లు

  • మొత్తం ఖర్చు రూ.23 వేల కోట్లు

  • కేంద్ర నిధులు 0.06 శాతమే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రాష్ట్ర ఖజానాలో తడబాటు కనిపిస్తోంది. బడ్జెట్ అంచనాలకు భిన్నంగా ఆదాయ వ్యయాలు ఉండడంతో ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. సొంత పన్నులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కలుపుకొని ఏప్రిల్ నెలలో కేవలం రూ.12,510 కోట్లు ఖజానాకు చేరింది. ఇందుకు భిన్నంగా ఖర్చులు పెరిగిపోవడంతో ఆదాయానికి సమానంగా అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాది మొత్తానికి పన్నులు కేంద్రం నిధులు కలుపుకొని రూ.2.34 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేయగా, ఏప్రిల్‌‌లో కేవలం రూ.12,500 కోట్లు వచ్చింది. ఇది మొత్తం ఆదాయ అంచనాలో కేవలం 5.34 శాతంగా ఉంది. ఇక రూ.10 వేల కోట్లకు పైగా అప్పు చేసి ఏప్రిల్ నెల మొత్తమ్మీద రూ.22,789 కోట్లు ఖర్చు చేశారు. ఇలా ఆదాయం కన్నా ఖర్చు దాదాపుగా రెట్టింపు నమోదు కావడంతో మిగిలిన మొత్తాన్ని రుణంగా తీసుకుని తొలి నెల గట్టెక్కగలిగారు. ఏడాది మొత్తానికి రూ.75,868 కోట్లు రుణంగా తీసుకోవాలని ప్రతిపాదించగా, ఒక్క ఏప్రిల్‌‌లోనే 14.37 శాతంతో రూ.10,900 కోట్లు రుణంగా తీసుకున్నారు.
వివిధ రంగాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. సొంత పన్నుల ద్వారా రూ.1,2086 కోట్లు రాగా, అందులో జిఎస్‌‌టి ద్వారా రూ.4,900 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.వెయ్యి కోట్లు, ల్యాండ్ రెవెన్యూ ద్వారా కేవలం రూ.5 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.1,700 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.1,400 కోట్లు వచ్చాయి. ఇక కేంద్రంలో రాష్ట్ర వాటాగా రూ.46,759 కోట్లు అంచనా వేయగా.. కేవలం 5.23 శాతంతో రూ.2,444 కోట్లు ఖజానాకు వచ్చాయి. కేంద్రం నుంచి గ్రాంట్లుగా రావాల్సిన రూ.32,458 కోట్లలో అత్యల్పంగా కేవలం రూ.6 లక్షలు వచ్చాయి. ఈ కారణంగానే తొలి నెలలోనే భారీగా అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

తొలి నెలలోనే లోటుపోటు

ఏప్రిల్ నెలలో ఆదాయం కన్నా వ్యయం పెరిగిపోవడం భారీగా రుణాలకు వెళ్లడంతో లోటుపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఏడాది మొత్తానికి రూ.22 వేల కోట్లు ఆదాయలోటు ఉంటుందని అంచనా వేయగా, తొలి నెలలోనే రూ.10,277 కోట్ల లోటు నమోదైంది. ద్రవ్యలోటు కూడా రూ.76 వేల కోట్ల వరకు అంచనా వేయగా, ఏప్రిల్‌‌లోనే రూ.10,900 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్