ప్రజాశక్తి- గన్నవరం : విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ క్యాంపును మంగళవారం ప్రారంభించారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయా ణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరి స్తోందని, ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగానే గన్నవరం విమానాశ్రయంలో ఈ పరీక్షలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం ఎవరికీ ఎలాంటి అనారోగ్య లక్షణాలూ లేవని, అయినా ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అలాంటి వారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాట్లు చేశామని, బాధితులకు వైద్యం అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.
Gannavaram: విమానాశ్రయంలో ఎబోలా స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం
26 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 26, 2026, 12:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)