విజయవాడ : కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ(యం) పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసాలపై కేంద్రం కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ద్వారా దాడి చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండించింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. బిజెపి చేతిలో రాజకీయ సాధనంగా ఉన్న ఇడి …. సిపిఐ(యం)ను అప్రతిష్టపాలు చేయాలన్న దుర్బుద్దితో దాడులకు పూనుకొన్నదన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా నిరసనలు తెలియజేయాల్సిందిగా సిపిఐ(యం) పిలుపునిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతల నుండి తొలగిన వెంటనే కన్నూరు, తిరువనంతపురంలోని విజయన్ ఇళ్లపై ఇడి దాడి చేయడం కక్షపూరితం, అప్రజాస్వామికమన్నారు. ఇడి, సిబిఐ, ఎన్ఐఎ వంటి సంస్థలను కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపయోగించి ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని పార్టీ శాఖలకు పిలుపునిచ్చారు. ఈ దాడులను ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు ఖండించాలని సిపిఐ(యం) కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
పినరయి విజయన్‌పై ఇడి దాడులకు వ్యతిరేకంగా నిరసనలు : సిపిఐ(యం) పిలుపు
27 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 27, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)