test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతిలో రూ.2500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

5 రోజుల క్రితం

Rs 2,534 crore office, housing projects in Amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో రూ.2,500కోట్ల విలువైన రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం రెసిడెన్షియల్ టౌన్ షిప్ లు ఉన్నాయి. ఇందులో భాగంగా కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కోసం రూ.1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్లు వెచ్చించనుంది. కామన్‌సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మల్టీస్టోరేజ్‌ నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణం కోసం ఇప్పటికే సీఆర్‌డీఏ 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్‌, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్