తెలంగాణ : బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్టు చేయడానికి పోలీసులు సన్నద్ధమయ్యారు. శనివారం తెలంగాణ భవన్ లో సుమన్ ఉన్నారని తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. గో బ్యాక్ పోలీసులు అంటూ … కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎసిపి ప్రవీణ్ మాట్లాడుతూ …. బాల్క సుమన్‌పై 6 సెక్షన్ల కింద కేసు నమోదైందన్నారు. మిలిటెంట్ట తరహాలో ఉద్యమాలు చేయాలని బాల్క సుమన్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. అతడి వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. బాల్క సుమన్‌పై 326(g), 351(3), 353(1)(b), r/w55, r/w 61(2)(a), bns 4 pdppa కింద కేసు నమోదైంది.
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
30 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 01:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)