నిరుపేదలకు ఆటోల పంపిణీ
హైదరాబాద్ : రియల్ హీరో సోను సూద్, మాల్యవి కరణోదయ సొసైటీ సంయుక్తంగా వనపర్తి జిల్లాలోని సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామ ప్రజల కోసం ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. దీనితో పాటు హైదరాబాద్‌లోని దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద ఆటో కార్మికులకు జీవనోపాధి కోసం ఉచితంగా ఆటోలను బహూకరించారు. అంబులెన్స్ అందించడం ద్వారా ప్రాణాలు రక్షించవచ్చని, అలాగే ఉచిత ఆటోల పంపిణీ ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలవవచ్చని ఈ సందర్భంగా సోను సూద్ పేర్కొన్నారు. 22 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యాన్నదానం, పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రి, మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ వంటి ఎన్నో సామాజిక సేవలు అందిస్తున్న సొసైటీ ఫౌండర్ కొండ కృష్ణమ్మను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తమను ప్రోత్సహించిన సోను సూద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ పేదలకు అండగా ఉంటూ సొసైటీ సేవా కార్యక్రమాలను ఇలాగే ముందుకు తీసుకెళ్తామని కొండ కృష్ణమ్మ తెలిపారు.








కామెంట్‌లు (0)