ప్రజాశక్తి-గోకవరం (తూర్పు గోదావరి) : ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన గోకవరం మండల తాసిల్దార్ కార్యాలయంలో తహిల్డర్ పి.రామకృష్ణ అధ్యక్షతన మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ,ల కి సంబంధించిన ప్రముఖులుతో ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి అనే దానిపై అవగాహన కల్పించారు. కొత్త ఓట్లు నమోదు ప్రక్రియతో పాటు చనిపోయిన వారు ఓట్లు తీసివేయడం, ఓటరు పూర్తి వివరాలు డేటాలో పొందుపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగిందని తహిల్డర్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించి మండలంలోని 64 బూత్లలో ప్రతి పార్టీకి పిఎస్ కి ఒక్కరు చొప్పున బిఎల్ఎ లు, బి ఎల్ ఓ కలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరు డేటా అప్లికేషన్ లో ఎంటర్ చేయించి వారి యొక్క సంతకాన్ని తీసుకుని అప్లికేషన్లు బిఎల్ఓ కి అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తరపున గోకవరం మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్నదొర, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్తి వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ముప్పిడి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నుండి నాగం.వెంకటపతి, జనసేన నుండి దోసపాడు చిన్న సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ నుండి కోడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం పై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 13, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)