test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌ – 11 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ సిఐడి

6 రోజుల క్రితం

Online Betting Network: Telangana CID Arrests 11 People
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణలో చట్టవిరుద్ధంగా సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై తెలంగాణ సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మెరుపు దాడి చేసింది. అంతర్జాతీయ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ ‘డఫాబెట్’ తో సంబంధాలున్న ఒక భారీ ముఠాను చేధించి, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన 11 మంది కీలక నిర్వాహకులను అరెస్ట్ చేసింది. బెట్టింగ్ ద్వారా వస్తున్న నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు (మనీ లాండరింగ్) వీరు ఏకంగా 46 అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను, ఎనిమిది విభిన్న లేయర్స్‌ ద్వారా లావాదేవీలను ఉపయోగించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, కియా సెల్టోస్ వంటి లగ్జరీ కార్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు, 26 మొబైల్ ఫోన్లు, 5 పాస్‌పోర్టులు, రూ. 3.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్