test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అది రైతుల మెడకు ఉరిపెట్టే డిస్కం : కెటిఆర్

31 మే, 2026

it-is-a-discom-hanging-on-the-neck-of-the-farmers-ktr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 03:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ :  రైతు డిస్కం పేరుతో సిఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని, అది రైతుల మెడకు ఉరిపెట్టే డిస్కం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఆదివారం జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గతంలో సాగుకు రోజుకు 3 గంటల విద్యుత్‌ చాలన్నారని, ఇప్పుడు మాటమార్చి రైతు డిస్కం ఏర్పాటు చేస్తామంటున్నారని అన్నారు. అది రైతు మెడకు ఉరి పెట్టే డిస్కం అని మండిపడ్డారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక సమయంలో స్థానికంగా ఆరు వేల ఇళ్లు కట్టిస్తామన్నారని, ఇప్పటివరకు ఆరు ఇళ్లు అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 420 హామీలను అమలు చేసి చూపించాలని అన్నారు. కేసీఆర్‌ అప్పులు చేసి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారని, రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్