తెలంగాణ : ‘ మోడి ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది ` అని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ప్రధాని చేతుల మీదుగా వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితో పాటు సిఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడి ప్రణాళిక వికసిత్ భారత్ తో కలిసి నడుస్తామని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని.. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పని లేదని చెప్పారు. అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. “దేశ జనాభాలో తెలంగాణ 3 శాతం వాటా కలిగి ఉంది. దేశ జీడీపీకి తెలంగాణ 5 శాతం వాటా ఇస్తోంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకెళ్లేందుకు అవసరమైన అభివృద్ధి ఉత్సవం. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీని తెలంగాణ సాధిస్తుంది. మోడి ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశాభివృద్ధిలో ఆరు మహానగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న ఆ ఆరు నగరాలను కేంద్రం ప్రోత్సహించాలి” అని రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
మోడి ఆశీర్వాదం ఉంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి : సిఎం రేవంత్ రెడ్డి
10 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 10, 2026, 04:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)