test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​పిల్లలు కనేందుకు ప్రోత్సాహకాలు…

28 మే, 2026

cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 11:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ విధానాలకు భిన్నంగా, మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు కొత్త ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. 1990లో రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 3 శాతం ఉండగా, ప్రస్తుతం 1.5 శాతానికి పడిపోయింది.
ఇది 2.1 పునరుద్ధరణ రేటుతో పాటు జాతీయ సగటు కంటే చాలా తక్కువ. కొన్ని నివేదికల ప్రకారం, ఈ శతాబ్దం మధ్య నాటికి రాష్ట్ర జనాభాలో దాదాపు పావు వంతు మంది వృద్ధులే ఉంటారు. దీంతో శ్రామిక శక్తికి వారిపైనే ఆధారపడటం పెను భారం కానుంది.
ప్రతిపాదిత ప్రోత్సాహకాలు: ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడవ బిడ్డకు రూ.30 వేలు, నాల్గవ బిడ్డకు రూ.40 వేలు అందించాలని ప్రతిపాదించింది. ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ. 1,000. 18 సంవత్సరాల వయస్సు వరకు ఉచిత విద్య, తల్లులు ఇంటి నుండి పని చేయడానికి నిబంధనల సడలింపు, పాఠశాల హాజరు కోసం ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చెల్లించే ‘తల్లికి వందనం’ పథకానికి నిధుల పెంపు, ప్రసూతి సెలవులు పెంపు, అంగన్‌వాడీ, పిల్లల సంరక్షణకు మద్దతు వంటి ప్రోత్సాహకాలను ప్రకటించింది.
అయితే ఈ సింగిల్ పేమెంట్ ప్రోత్సాహకాలు కొన్ని కుటుంబాలను ముందుగా పిల్లలను కనడానికి ప్రోత్సహించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవాలను పరిశీలిస్తే ఈ విధానాలు సంతానోత్పత్తిలో పెద్దగా పెరుగుదలను నమోదు చేయలేదని సూచిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు తక్కువ మంది పిల్లలను కనడానికి కారణం గృహనిర్మాణం, ప్రైవేట్ విద్య ఖరీదైనవిగా మారడం, స్థిరమైన ఉపాధి త్వరగా కాకుండా ఆలస్యంగా లభించడం, పిల్లల జీవన నాణ్యతపై ఆకాంక్షలు పెరగడం వంటివి కారణాలుగా ఉన్నాయి. ప్రతిపాదిత ప్రోత్సాహకాలు ఒక అదనపు బిడ్డను పెంచడానికి 18 సంవత్సరాల ఖర్చును భర్తీ చేసే అవకాశం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయాలని కూడా పేర్కొంది. ఇది ప్రస్తుత సామాజిక మౌలిక సదుపాయాలతో ఎక్కువ మంది పిల్లలను కనడానికి విరుద్ధం. ఫ్రాన్స్, నార్డిక్ దేశాలు సార్వత్రిక పిల్లల సంరక్షణ, సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు, వేతనంతో కూడిన తల్లిదండ్రుల సెలవు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాల విద్య, తల్లులు ఎదుర్కొనే వృత్తిపరమైన ఇబ్బందులకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణ, కుటుంబ అవసరాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా విజయాన్ని సాధించగలిగాయి.
అయితే, భారతదేశంలో ఇప్పటికీ, పని చేసే తల్లులకు సరైన వేతనం అందటం లేదు. ముఖ్యంగా వారిని శ్రామిక శక్తిగా పరిగణించరు. అయితే, ప్రభుత్వ ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాలు నిరుపేద కుటుంబాలను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మరో ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పిల్లల అభివృద్ధికి తగిన దీర్ఘకాలిక మద్దతును, స్పష్టమైన హామీని ఇవ్వకుండా ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు స్వల్ప నగదు ప్రోత్సాహాలను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది.
చివరగా, నీటి కొరత, పట్టణ రద్దీ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి పర్యావరణ సమస్యలు కూడా దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా ఆధారిత డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నాయి. అయితే, రాజ్యాంగంలో ఉన్న సమస్యను పరిష్కరించడానికి పిల్లలను కనమని, వ్యక్తిగత నిర్ణయాలను మార్చుకోమని కుటుంబాలను కోరడమనేది తీవ్రమైన అసమతుల్యతకు దారితీస్తుందని పలువురు భావిస్తున్నారు.
/‘ది హిందూ’ సంపాదకీయం/

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్