test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కల్తీ నెయ్యి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి : పోతుగుంట

20 ఫిబ్రవరి, 2026

2
avatar
Reporter 1

ప్రచురించబడింది ఫిబ్ర 20, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజంపేట :  గత వైసిపి ప్రభుత్వ హయాంలో శ్రీశైలంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని శ్రీశైలం ఆలయ ట్రస్టు చైర్మన్‌ పోతుంగుంట రమేష్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. శుక్రవారం వైబిఎన్‌ పల్లెలోని ఆయన నివాసంలో  పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. 2023 నుండి మార్చి 2024 వరకు అప్పటివరకు సరఫరా చేస్తున్న విజయ డైరీ సంస్థను కాదని, నిబంధనలను మార్చి రాజేష్‌ కార్పొరేషన్‌ కు ఎలాంటి అనుభవం లేకపోయినా టెండర్‌ను  అప్పగించారని అన్నారు.  అప్పటి  వైెెఎస్ఆర్‌సిపి  ప్రభుత్వంలోని  ఒక మంత్రి, శాసనసభ్యులు, రాష్ట్ర స్థాయి అధికారి  దీని వెనుక ఉన్నారన్నారు. అందరి హస్తంతో 2,92,845 కిలోల నెయ్యి కిలో  రూ. 549 తో నాడు కొని రూ .16 కోట్లు వారికి చెల్లించారన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కల్తీ వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్