భానుడు భగభగ
నడినెత్తిన సెగసెగ
నడవాలి గబగబ!
కళ్లకు చలువద్దాలు
తలకు చుట్టు తువాలు
విడవకు పాదరక్షలు!
జీన్సు దుస్తులు వద్దు
నూలు వస్త్రాలు ముద్దు
రగ్గులు ఇకపై రద్దు!
రాకుండా నీరసం
తీస్కోండి నిమ్మరసం
మంచిదే మజ్జిగ రసం!
నూనె పదార్థాలు దూరం
ఇడ్లీలే ఉదయపు ఫలహారం
తగ్గించాలి కూరల్లో కారం!
ఏసీ గదికి వేయకు ఓటు
ఫ్రిడ్జ్‌లో నీరు గొంతుకు చేటు
అతి శీతలం ఆరోగ్యానికి కాటు!
మామిడిపళ్లూ తాటిముంజెలు
కర్బూజాలూ పుచ్చముక్కలు
బాలలందరి వేసవి నేస్తాలు!
– చెన్నాప్రగడ శర్మ,
94405 87567.








కామెంట్‌లు (0)