అన్నవరం గ్రామంలో రవి, కిరణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. గ్రామ పాఠశాలలో వీళ్లిద్దరూ చదువుకుంటున్నారు. అయితే, ఇద్దరికీ క్రికెట్ అంటే చాలా పిచ్చి. క్రికెట్ ఆట ఉన్నప్పుడు బడికి బంకు కొట్టి మరీ మ్యాచ్‌లు చూసేవారు. ఐపీఎల్ మ్యాచ్‌లు వచ్చినప్పుడు ఇద్దరూ రెండు టీమ్‌లుగా విడిపోయేవారు. తమ టీమ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ గొడవ పడేవారు. ఒక రోజు అలా గొడవ పడుతుంటే వాళ్ల నాన్న వచ్చి బాగా కోప్పడ్డాడు. అప్పుడు రవి, నాన్నతో, “నాన్న, నా తప్పేమీ లేదు. కిరణ్ నన్ను ‘నీ జట్టు మంచిది కాదు, చెడ్డది’ అని తిడుతున్నాడు” అనగానే, కిరణ్ కూడా అలాగే చెప్పాడు.
నాన్నకు విషయం అర్థమైంది. ఇద్దరినీ దగ్గరకు తీసుకుని, “పిచ్చి పిల్లల్లారా! మీరు ఇంతలా వాళ్ల కోసం గొడవ పడుతున్నారు. ఇది బుద్ధి లేని పని. మీరు బాగా చదువుకోవాలి, ఆడుకోవాలి. వేరేవాళ్ల ఆట చూస్తూ కాలక్షేపం చేయడం, గొడవలు పడడం మంచిది కాదు. బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలి. ఇలా తగాదాలు పడకూడదు. ఇంకెప్పుడూ క్రికెట్ కోసం గొడవలు పడకండి. చక్కగా బడికి వెళ్లండి” అని ప్రేమగా చెప్పాడు.
రవి, కిరణ్‌లకు నాన్న మాటలు బాగా అర్థమయ్యాయి. ఆ తరువాత వాళ్లు ఎప్పుడూ క్రికెట్ ఆట గురించి గొడవ పడలేదు.
- బి. విశ్వతేజ, 7వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
అనంతసాగర్, సిద్దిపేట జిల్లా.








కామెంట్‌లు (0)