టాయిలెట్ సీటుపై ఏర్పడే పసుపు రంగు మొండి మరకలను ఐస్ క్యూబ్స్‌తో శుభ్రం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ మరకలు ఎంత రుద్దినా సులభంగా పోవు. వాటిని తొలగించడానికి చాలామంది ఖరీదైన కెమికల్ క్లీనర్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే ఆ రసాయనాల ఘాటు వాసన కళ్లకు, ముక్కుకు చికాకు కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
టాయిలెట్ సీటుపై కనిపించే పసుపు మరకలకు ప్రధాన కారణాలు మూత్రపు మరకలు, సున్నపురాయి పేరుకుపోవడం. కాలక్రమేణా ఇవి గట్టిగా పట్టుకుని సాధారణ బ్రష్‌తో తొలగించడం కష్టమవుతుంది. చాలా రోజులుగా శుభ్రం చేయకపోతే మరకలు మరింత మొండిగా మారిపోతాయి. టాయిలెట్‌పై చల్లటి ఐస్ ఉంచినప్పుడు మరకలపై అకస్మాత్తుగా చల్లదనం ప్రభావం చూపుతుంది. దీనివల్ల గట్టిగా పేరుకుపోయిన మురికి కుంచించుకుని చిన్న పగుళ్లు ఏర్పడతాయి. దీంతో మరకలు వదులై సులభంగా తొలగిపోతాయి. ఈ ప్రక్రియను ‘థర్మల్ షాక్ ఎఫెక్ట్’ అని అంటారు.
ఎలా శుభ్రం చేయాలి?
ముందుగా ఫ్రీజర్ నుంచి గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. వాటిని టాయిలెట్ బౌల్‌లో, మరకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేయాలి. 20 నుంచి 30 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. తరువాత టాయిలెట్ బ్రష్‌తో మెల్లగా రుద్దాలి. అప్పటికే మరకలు వదులై ఉండటంతో అవి సులభంగా తొలగిపోతాయి. చివరగా ఫ్లష్ చేస్తే టాయిలెట్ శుభ్రంగా కనిపిస్తుంది. మరకలు చాలా పాతవైతే ఇదే పద్ధతిని మరోసారి ప్రయత్నించవచ్చు. ఐస్ క్యూబ్స్‌తో పాటు కొద్దిగా వెనిగర్ ఉపయోగిస్తే మరింత మంచి ఫలితం వస్తుంది.








కామెంట్‌లు (0)