test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో భారీగా యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం!

1 రోజు క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతం కావడం, సెలవు దినాలు తోడవడంతో శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న యాత్రికులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా అల్పాహారం, పాలు, తాగునీరు అందిస్తున్నారు.  నిన్న ఒక్కరోజే మొత్తం 90,107 మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. 52,236 మంది యాత్రికులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే రూ. 4.23 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్