test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖమ్మంలో కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా

4 గంటల క్రితం

bus acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 08:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  •  26 మందికి గాయాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లా చెక్కపల్లి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కేవీఆర్  ట్రావెల్స్ బస్సు, కొత్తలంకపల్లి సమీపంలో అదుపుతప్పి రైల్వే బ్రిడ్జిని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 22 మందికి స్వల్ప గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన నలుగురితో పాటు మిగిలిన క్షతగాత్రులను తక్షణ చికిత్స నిమిత్తం పెనుబల్లి, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్