మర్పల్లి (వికారాబాద్) : వికారాబాద్ జిల్లా మర్పల్లిలో శనివారం మధ్యాహ్నం ఓ హోటల్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జేసీబీ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా ? అని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.
కుప్పకూలిన హోటల్ స్లాబ్ – నలుగురికి గాయాలు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 06, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)