ప్రజాశక్తి- వేపాడ : ఈ ఏడాది తొలకరి నువ్వు పంట ఆశాజనకంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తొలకరి నువ్వు విత్తనాలు వేసిన పొలాల్లో ప్రస్తుతం పంట పువ్వు దశలోను, పిందె దశలోనూ ఉందని తెలిపారు. సుమారు 100 హెక్టార్లలో పంట ఏపుగా పెరిగి కనిపిస్తుంది. వాతావరణం ఇదేవిధంగా అనుకూలిస్తే .. రైతన్నకు తొలకరిపంటతో కొంత వరకు ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం నువ్వు పంటను పరిశీలించిన అనంతరం ఏవో ఎంఎస్ఎస్ స్వాతి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రైతులు ముందుగా తొలకరి పంట కోసం నువ్వు విత్తనాలు వేశారని వివరించారు. వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం 100 హెక్టార్ల వరకు నువ్వు పంట ఆశాజనకంగా కనిపిస్తుందని అన్నారు. అయితే కొంతమంది రైతుల పొలాల్లో వేసిన నువ్వు విత్తనాలు మొలక దశలో ఉన్నాయని చెప్పారు.
ఆశాజనకంగా తొలకరి నువ్వు పంట
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)