ప్రజాశక్తి – ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా): వశిష్ట గోదావరి నదిలో స్నానానికి దిగి ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో చోటు చేసుకుంది. పిప్పర గ్రామానికి చెందిన జక్కంశెట్టి భానుప్రసాద్ (18) అనే యువకుడు వల్లూరు పంచాయతీ గెద్దాడవారిపాలెంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటున్నాడు. శుక్రవారం తన స్నేహితులతో కలిసి కరుగోరుమిల్లి పురస్కార రేవు వద్ద సరదాగా గోదావరిలో స్నానానికి దిగిన భానుప్రసాద్, అకస్మాత్తుగా కాలుజారి నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గజఈతగాళ్లతో గాలించగా శుక్రవారం రాత్రికి భానుప్రసాద్ మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి గతంలోనే మరణించగా, తల్లి ఉపాధి కోసం విదేశాల్లో ఉంటోంది. కంటికి రెప్పలా చూసుకుంటున్న మనవడు కళ్లముందే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో అమ్మమ్మ, తాతయ్యలతో పాటు బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆచంట ఎస్సై కే. వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వశిష్ట గోదావరిలో స్నానానికి దిగి యువకుడు మృతి..
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 06, 2026, 12:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)