test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

673 జిఒ రద్దయ్యేంత వరకూ పోరాటం

2 రోజుల క్రితం

cpm protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 11:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ: నగరాలు, మున్సిపాలిటీల్లో ప్రజల ఆస్తులు, పౌర సేవలన్నింటినీ ప్రయివేటీకరణ చేస్తూ టిడిపి కూటమి ప్రభుత్వం విడుదల చేసిన 673 జిఒ రద్దు అయ్యేంత వరకూ రాష్ర్ట వ్యాప్తంగా పోరాటం సాగిస్తామని, ఇందుకు ప్రజలు కలిసి రావాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు కోరారు. మున్సిపల్‌ ‌కార్పొరేషన్లు, సర్వీసులను, పౌర సేవలను ‌పిపిపికి అమ్మేస్తున్న జిఒ నంబర్‌ 673‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ‌సిపిఎం ఆధ్వర్యంలో ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ ‌వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. 673‌ జిఒను రద్దు చేయాలని, పౌర సేవల ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జిఒ కాపీలను దగ్ధం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ ఎ.ఒ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. బాబూరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. రద్దయిన చెత్త పన్నుతోపాటు , యూజర్ చార్జీల పేరుతో నీటి మీద, డ్రైనేజీ మీద, పార్కుల మీద, లైటింగ్ మీద, రోడ్ల మీద కూడా పన్ను వసూలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్‌, తూర్పు సిటీల కార్యదర్శులు భూపతి రమణారావు, పి కృష్ణ, నాయకులు కె దుర్గారావు, టి ప్రవీణ్‌, కెవి రమణ, టి శేఖర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్