న్యూఢిల్లీ : రుతుపవనాల రాక మరోవారం పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు శ్రీలంక సగం వరకు వచ్చి ఆగిపోయాయి. ఈ ఏడాది వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా మే నెల చివరికల్లా రుతుపవనాలు చేరుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య రావొచ్చని ఐఎండి అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల వర్షాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జూన్లో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండి అంచనా వేసింది. మధ్య, వాయువ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది.
నైరుతి రాక ఆలస్యం
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 30, 2026, 12:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)