ప్రజాశక్తి - విజయవాడ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కేపై ఈరోజు బిజెపి పాలనలోని రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ర్యాలీ చేస్తుండగా కొంతమంది దాడిచేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. పార్టీ ప్రారంభించినప్పటి నుండీ సోషల్ మీడియాలో సిజెపిపై విషం కక్కుతున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ యువతలో ముందుకొచ్చినప్పటి నుండే దాడి తీవ్రమైందని తెలిపారు. విధానాలను వ్యతిరేకించేవారిపై భౌతికదాడులు చేయడం పెరుగుతున్న నిరంకుశ ధోరణులకు నిదర్శనమని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. యువతలో వస్తున్న అసంతృప్తిని పరిష్కరించలేక దాడులకు పూనుకోవడం గర్హనీయమన్నారు. ఇటువంటి దాడులు ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు వ్యతిరేకించాలన్నారు. ప్రజా ఆందోళనలకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.
సిజెపి అభిజిత్ దీప్కేపై దాడికి సిపిఎం ఖండన
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 15, 2026, 07:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)