test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిఎస్సీ స్పోర్ట్స్ కోటాల నియామకాలపై న్యాయ విచారణ జరిపించాలి

4 గంటల క్రితం

ap dsc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 08:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా నియామకాలపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరి సర్టిఫికేట్‌లను బహిరంగపర్చాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. స్పోర్ట్స్ కోటా ఎంపికకు రూపొందించిన జివోలు, వాటి అమలు తీరుపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. విడివిడిగా జరగాల్సిన డిఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే డైరెక్టర్‌కి ఎందుకు అప్పగించారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చిన ప్రతిసారీ మరికొన్ని సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో పాల్గొన్న క్రిడాకారుల్లో కొద్దిమంది స్పోర్ట్స్ కోటాకు ఎంపిక కాకపోవడం అనేక అనుమానాలకు తావునిస్తున్నదని తెలిపారు. డిఎస్సీ ఉద్యోగ నియామకాలలో అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరిపేందుకు న్యాయ విచారణకు ఆదేశించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్